నవ భారతం – Bharadwaj (BRU)

నవ భారతం

మన భారతదేశం గురించి కొన్ని నిజాలు:-
 
1) భారత గణతంత్ర రాజ్యము నూటఇరవై కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది.

2) వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది.
 
3)  భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తిపర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి.
 

4)  ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది. 

 
  మన భారతదేశం గురించి మరికొన్ని నిజాలు:-
 
 
                   ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గొప్పలు చెప్పుకుంటాం మనం కాని చూస్తుంటే   అలా అనిపించట్లేదు. సోనియా తర్వాత రాహుల్ గాంధి, YSR తర్వాత YS జగన్… ఇలా మనకు తెలీకుండానే రాచరిక వ్యవస్థ లోకి అడుగుపెడ్తున్నాం. ఇప్పుడున్న ప్రజాస్వామ్యం కూడా పనికిరాదు మనకి అసలు.మనం ఎన్నుకున్న మనుషులే ఒక్క రోజైన ఎదుటి మనిషిని విమర్శించని రోజనేది ఉందా అని చూస్తె… లేదనే చెప్పాలి. ఇలా వాళ్ళ వాదులాటలకే  వాళ్లకు సమయం సరిపోవట్లేదు. ఇక ప్రజల్ని ఎం చూస్తారు… స్వేచ్ఛ…. ఇది మామూలు ప్రజలకన్నా దోపిడీలు, హత్యలు, మానభంగాలు చేసిన వాళ్ళకే మన దేశం లో ఎక్కువగా ఉంది… 
 
2010 లోనే మన దేశం లో బయట పడిన కొన్ని కుంభకోణాలు…….
 
 1. 2010 ..2జీ స్పెక్ట్రం కుంభకోణం.
 2. ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణం (ముంబయి)
 3. కామన్ వెల్త్ క్రీడల కుంభకోణం
 4. ఇంటి రుణాల కుంభకోణం
 5. ఉత్తర ప్రదేశ్ ధాన్యం కుంభకోణం
 6. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంస్థ భూముల కుంభకోణం
 7. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (క్రికెట్) స్కాం
 8. 2011.. స్విస్ బ్యాంకులో భారతదేశ నల్లధనం కేసు
 9. నోయిడా కార్పోరేషన్ భూ కుంభకోణం
 10. బళ్లారి గనుల కుంభకోణం
 
 
 
                             ఇలా చెప్పుకుంటూ పోతే దేశం మొత్తం ఎందుకు మన రాష్ట్రం లోనే YS జగన్ & YSR లు టాప్ లిస్టు లో ఉంటారు. ఎన్ని రకాలుగా మున్చాలో అన్ని రకాలుగా ముంచారు ప్రజలని…. రిజర్వేషన్ అని ప్రజలను బద్దకస్తులుగా  మారుస్తున్నారు మన నాయకులు. వృద్ధుల నుండి  హాండీ-కాప్పేడ్ పీపుల్ వరకు రిజర్వేషన్ అవసరమే….. మరి కులాలకనుగునంగా రిజర్వేషన్ ఎందుకో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు… ఇలా నాయకులే కులాల పేరుతో విడదీస్తూ “కుల-మత బేధం ఉండొద్దు” అని బీరాలు పలుకుతారు… రిజర్వేషన్ ఉండాలి కాని కుల మతాలకనుగునంగా కాకుండా ఆ కుటుంబ ఆదాయాన్ని అనుసరించి రిజర్వేషన్స్ పెడ్తే బాగుంటుంది…
 
 
 
 
 
                అతి పెద్ద సైనిక వ్యవస్థ మన దేశానిది… కాని దాని మీద అధికారం మాత్రం ప్రభుత్వానిది. సిబిఐ లాంటి సంస్థల్ని కూడా ప్రభుత్వమే నడిపిస్తుంది అని అంటున్నారు… కాని అది ఎంత వరకు నిజమో నాకు తెలిదు. సైన్యం మిద అధికారం ఉండాలి కాని సర్వాధికారాలు ఉంటే ఎలా. మనం ఏర్పరచుకున్న నియమాల్ని తుంగలో తొక్కి మన దేశం లోకి చొరబడి ఇద్దరు సైనికుల్ని అతి దారుణంగా చంపినా దుర్మార్గులను వదిలేసింది మన ప్రభుత్వం..  శాంతి కి కూడా ఒక limit అనేది ఉంటది… దాన్ని ఎదుటి వాళ్ళు అసమర్థత కింద చూసి దాడులకు పాల్పడితే వూర్కోవడం ఎంత వరకు సమంజసం….. పట్టుబడ్డ ఉగ్రవాదుల్ని జైలు లో పెట్టి టైం కి తిండి, బట్ట, పెట్టుకుంటూ వైద్య పరీక్షలు చేస్తూ జాగ్రతగా చూసే కర్మ మన దేశానిది…. ఒక రకంగ వాళ్ళు వాళ్ళ దేశం లో కన్నా మన దేశం లోనే ఎక్కువ రోజులు ఆనందంగా, ఆరోగ్యం గ బ్రతుకుతున్నారు… వాళ్లకు మన దేశ న్యాయస్థానం లోనే వాళ్ళ తరపున వాదించడానికి ఒక న్యాయవాది ని పెద్తున్నాం మనం… అసలు ఆ వాదించే వాడికైనా “నేను చేసేది correct కాదు” అని ఎందుకు అనిపియ్యదో నాకు అర్థం కాదు..
 
 
 
                            

భారత జాతీయ ప్రతిజ్ఞ

 
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
 
 
                భారతీయులందరూ నా సహోదరులు

 
 
                                     ఇది మనం చిన్నప్పుడు చదుకున్నదే ప్రతి రోజు… కాని ఎంత మంది అలా ఇతర అమ్మాయిలను సోదరి లుగా చూస్తున్నారు?. మొన్నటికి మొన్న మన దేశ రాజధాని లో ఒక విద్యార్థిని మిద అరాచకం అది కూడా మరచిపోక ముందే ఐదేళ్ళ పసి పాపలో కూడా ఆడపిల్ల ని చుసిన దుర్మార్గుడు…  అందుకు నిదర్శనం….. మహిళలపై జరుగుతున్న పలు అత్యాచారాలు పరిశీలిస్తే ప్రతి సంవత్సరం రమారమి 12 వేల మానభంగం కేసులు, 13 వేల అపహరణ కేసులు, 26వేల అకృత్యాలు, 11 వేల వేధింపు కేసులు, దేశంలోని పలు పోలీసు స్టేషన్లలో నమోదు అవుతున్నాయని అంచనా. ఇవి పోలీసు స్టేషన్లో వాస్తవంగానమోదు అయ్యే కేసుల వివరాలను బట్టి మాత్రమే తెలుసుంది. కొన్ని కేసులు పోలీసు స్టేషన్లో నమోదు కావడం లేదు, సరియైన సమాచారం అందక నేరపరిశోధనలో అర్థాంతరంగా రద్దు కావడం వల్ల మహిళల సమస్యలపట్ల సరియైన అవగాహన లేకుండా పోతుంది.
 
 
    నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను

 
 
                        మాతౄదేవో భవః, పితౄదేవో భవః, ఆచార్యదేవో భవః అన్నది మన ఆర్యోక్తి. ప్రతి మనిషి జీవితంలో ఈ ముగ్గురు వ్యక్తులకీ అంత ప్రాముఖ్యత ఉంది. కాని రోజు మనం చదివే పేపర్ లో ఎన్ని వార్తలు రావట్లేదు “కన్నా తల్లి తండ్రుల్ని వదిలేసినా కొడుకు” అని….. మనల్ని కని పెంచిన అమ్మా,నాన్న లానే పోషించలేని వాడు ఉంటె ఎంత పోతే ఎంత. 
 
 
 
 
తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుడు,
 
వాడు పుట్టినేమి,గిట్టినేమి.

పుట్టలోని చెదలు పుట్టవా! గిట్టవా! 

విశ్వదాభి రామ! వినుర వేమ!
 
గురువు అంటే అంధకారం తొలగించువాడని చెబుతారు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు కాబట్టే గురువుకు త్రిమూర్తులతో సమానమైన స్థానమిచ్చి పూజిస్తాం.అక్షరాభ్యాసం ఐన వెంటనే పిల్లలకు …
 
గురుర్భ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః

 

                       దండం దశగుణంభవేత్ అన్నారు… కొన్నేళ్ళ క్రిందటివరకూ టీచర్లు పిల్లల్ని కొట్టడం , కంట్రోల్లో పెట్టడం సర్వసాధారణం!తల్లితండ్రులు కూడా పిల్లోడు బాగుపడతాడు అని పట్టించుకొనేవారు కాదు కానీ ఇప్పుడు అది పెద్ద నేరమైపోయింది. సహేతుకమైన కారణం ఉన్నా కూడా పిల్లల్ని దండించ కూడదు.తల్లితండ్రులు కూడా పిల్లల్ని కొట్టడం పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు.
 
                        ఆచార్యదేవో భవః అని గౌరవించె స్థాయి నుండి  గురువుల మీద కుళ్ళు జోకులు వేసుకునే స్థితికి దిగజారింది మన దేశం.. దానికి విద్యార్థుల తప్పెంత ఉందొ ఉపాధ్యాయులది కూడా అంతే ఉంది… చదువు ని వ్యాపారం చేసేసరికి ఇలా మారిపోతున్నారు పిల్లలు… చిన్నప్పటి నుండే  ఇది తప్పు అని వారించాల్సిన తల్లి తండ్రులు వాళ్ళ ముద్దు ముద్దు మాటలకూ ఆనందపద్తున్నారే కాని అల అనొద్దు అని చెప్పే వాళ్ళు కరువయ్యారు. 
 
 
                                                                     –భరద్వాజ్ 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

4 thoughts on “నవ భారతం – Bharadwaj (BRU)”

 1. wowwww thammuduu
  excellent work
  nijamga chalaa bagundi
  chaduvutunte na kallalo neellochaayi
  its very heart touching thammuduuu

  idi okka pvt site lone kakunda mana desam lo road road naa poster laga antichali thammuduu ..
  appudaina ye konchamaina marpu vastundemo chudali

  i really like it
  idantha sampadinchadam kosam nuvvu padda kashtaniki na hatsoff thammuduu
  really great work
  well done

  especially thandri dairy lo chivari page .. adi chaduvuthunte nenu edchesaanu ..
  entha mandi thallithandrulu oldage homeslo ala edusthuu unnaaroo..
  enthamandi thandrulu thallulu paiki cheppukodaniki evaru leka…manasullone edusthunnarooo…
  chanipoye chivari kshanamlo aina na vallani chudagalighte bagundu ani entha mandi alaa endlessly and hopelessly eduru chustunnaroo kadaaa..

  what a pityy !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *