“”ఏ మాయో చేసావే””!!!! – by Raghav


పల్లవి:

ఏ మాయో చేసావే ఓ చెలియా..

ఎదనే హాయిలొ ముంచేసావే నా చెలియా..
ఎపుడూ చూడని కలనే కళ్ళు చూస్తున్నాయా..
నిజమై నిలిచే నిమిషం కోసం వేచున్నాయా..
కదిలే అలలే ఎదలోతుల్లో ఉప్పొంగాయా..
రగిలే ఆశలే నా ఊహల్లో ఊరేగాయా..
మనసంత గాలిలో తేలిపోయెనే ఎందుకే ఈ వేళ..
తనువంత తేలికై తూలిపోయెనే ఇక నిలవనంది నేల..   “ఏ మాయో”

చర 1:


పొద్దు గడవదే హద్దే లేని మనసుకు నిన్ను చూడకుంటే..

నిద్దురుండదే మెరిసే నీలి కళ్ళకు నిన్ను తలచుకుంటే.. 
నడిచేనా హంసలైన వయ్యారి నడకలో హొయలు చూసివుంటే..
మెరిసేనా మెరుపులైనా చెలి కళ్ళలోనా ఆ వెలుగు చూసివుంటే..
చినుకల్లే చేరావే.. చిరుజల్లై తడిపావే..
గుండెళ్ళో దాగున్నా నా ప్రేమనంతా వరదై కదిపావే..   “ఏ మాయో”

చర 2:


వెన్నెలుండదే జాబిలి చెంత ఎన్నడూ విరిసే నీ నవ్వు చూసిఉంటే..

కూతలుండవే కోకిల గొంతుకెప్పుడూ  పలికే నీ మాట పిలుపు వింటే..
గాలైనా మురిసిపోదా నీ పరిమళాల ఆ శ్వాస తాకుతుంటే..
రాయైనా కరిగిపోదా నీ అడుగులోని ఆ సున్నితాన్ని చూస్తే..
మెరుపల్లే కలిసావే.. వలపే కలిగించావే..
బ్రతుకంతా నీతోనే గడపాలనేంత ఆశ రేపావే…      ” ఏ మాయో”         

2 thoughts on ““”ఏ మాయో చేసావే””!!!! – by Raghav”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *