Andham….Aakarshana…Prema …Jeevitham …(Dear friends please spend 2 min to read).. Sanju

అందం..ఆకర్షణ …ప్రేమ..జీవితం…..

 
ఈ నాల్గింటికి ఒక అవినాభావ సంభంధం ఉంది . అందమైన రూపాన్ని చూసి …ఆకర్షణకి లోనై ప్రేమ మొదలవుతుంది…ప్రేమ జీవితాలనే మార్చేస్తుంది..
కాని ఇక్కడ ఎలాంటి అందాన్ని చూసి ఆకర్షిమ్పబడుతున్నమో ఆలోచించండి….
****
మిర్యాలగూడ బస్సు స్టాప్ కి ఎదురుగా…చామనచాయ రంగుతో…చెదిరిన జుట్టు తో ..శంకర్ అనే పేరు కలిగిన దేహం తో ఒక శాల్తి నిలబడి ఉన్నాడు…
బస్సు స్టాప్ లోని వాళ్ళంతా ఆత్రుత గా ఎదురుచూసేది…బస్సు కోసం అయితే మనోడు మాత్రం ఎదురు చూసేది ఒక అమ్మాయి కోసం…అమ్మాయి అంటే అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు…చాల అందమైన అమ్మాయి..కాని మనోడికి ఆ అమ్మాయి అందం తో పనిలేదు…వాడు ప్రేమించేది ఆ అమ్మాయి మనసుని….
వాడి ఎదురు చూపులు ఫలించాయి…..వాడు ఎదురు చూస్తున్న అమ్మాయి రానే వచ్చింది…ఓర కంటి చూపుతో…పెదాలపై సన్నని చిరునవ్వుతో ఆ అమ్మాయి నడుస్తుంది…వాడిని సమీపించే కొద్ది ఆ అమ్మి నడక వేగం తక్కింది, తల నేల కు వరిగింది …నెమ్మదిగా వాడిని దాటుకుంటూ ఆ అమ్మాయి వెళ్తుంటే.. . వాడి కాళ్ళు నెమ్మదిగా కదిలాయి…ముందు ఆ అమ్మాయి …వెనక వీడు…ఇదే తంతు రోజు జరిగేది….బస్సు స్టాప్ దగ్గర నుండి ఆ అమ్మాయి కాలేజీ వరకు…
.
తన పేరు సంజన …సంజన ఎంత అందం గా ఉంటుందో తనకు తెలుసు…అందుకే తనకంటే అందమైన వాడిని భర్తగా పొందాలి అనుకుంది…అబ్బాయి లని వెంట తిప్పుకోవడం సరదానో లేక మరేదో నాకు తెలిదు కాని …శంకర్ ని వెంట తిప్పుకోవడం సంజనకి సరదా అయిపోయింది….రోజు అదే బస్సు స్టాప్ దగ్గర శంకర్ ఎదురు చూపులు…..సంజన ఓరకంటి చూపు … కొంటె నవ్వు శంకర్ కి పిచ్చేక్కించేవి .
.
ఒకరోజు సంజన కి అనుకోకుండా ఒక సంభంధం వచ్చింది….అబ్బాయి వాళ్ళకి దూరపు బంధువు …అచ్చం మహేష్ బాబులా ఉంటాడు..వాడి పేరు కూడా మహేష్ కావడం తో అంత వాడికి ప్రిన్స్ అని నామకారణం చేసారు…అబ్బాయి అమ్మాయి కంటే అందం గా ఉంటాడు..దాంతో సంజన పెళ్ళికి ఒప్పుకుంది….చదువు అక్కడితో ఆపేసి ..దగ్గరలోనే మంచి ముహూర్తం ఉండడం తో..సంజన కొద్ది రోజుల్లోనే మిస్ నుండి మిస్సెస్ గా మారిపోయింది….
.
ఇక్కడ శంకర్ మాత్రం బస్సు స్టాప్ లో తన ఒపికనంతా ప్రదర్శిస్తూ…సంజన కోసం రోజు ప్రతీ రోజు ఎదురుచూడ సాగాడు…
సంజన అత్తారింటికి వెళ్ళింది అన్న నిజం కొద్ధిర్రోజుల్లోనే తెలుసుకుని..మొదట భాదపడ్డాడు..ఆ తర్వాత తనను తాను ఓదార్చుకుని..సంజన ఎక్కడున్నా ఎవరితో ఉన్న సంతోషం గా ఉంటె చాలు అనుకున్నాడు…
.
కాని సంజన ఎంత పోరాపాతుచేసిందో కొద్ది రోజుల్లోనే తెలుసుకుంది….అందమైన రూపం ఉన్న ప్రతి ఒక్కరికి అందమైన మనసు ఉండదని తెలుసుకుంది..
మహేష్ చూడడానికి అందం గా ఉన్నా..రాక్షస మనస్తత్వం కలవాడు….సంజన ని రోజు చిత్రహింసలు పెట్టేవాడు…
సంజన కి బతికుండగానే నరకం చూపించేవాడు…బతుకు కంటే చావే మేలు అనిపించేలా చేసేవాడు…
ఇవన్ని భరిస్తూ…సంజన తనలో తాను చిత్రహింసలు భరించేది..
సంజన చేసుకున్న పాపమో లేక పుణ్యమో తెలిదు కాని…తన భర్త మహేష్ కొద్ది రోజుల్లోనే ఆక్సిడెంట్ లో పోయాడు..
సంజన కి ఒకరోజు అనుకోకుండా “మని ఆర్డర్ ” వచ్చింది .
విధవ బతుకు భాతక లేక …తల్లి తండ్రులకి భారం అవ్వలేక…మహేష్ చేసిన అప్పులు తీర్చలేక…చావే శరణ్యం అనుకుంటున్న సంజన కి ఆ “మని ఆర్డర్” ఎంతో ఊరట నిచ్చింది…
ఇలా ప్రతి నెలా చివరన మనీ ఆర్డర్ వచ్చేది…సంజన బతుకు సాఫీ గా సాగిపోయేది ..కాని పంపించే వ్యక్తి అజ్ఞాతం గా ఉండేవాడు…
ఒకరోజు సంజన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అనుకుంది…పోస్ట్ మాన్ సహాయం తో ఆరాతీస్తే అది శంకర్ అని తెలిసింది….శంకర్ ఇంకా పెళ్లి చేస్కోలేదు…తన హృదయం లో ఇప్పటికి సంజన నే ఆరాదిస్తున్నాడు.
.
సంజన మనసులో అంతర్మధనం మొదలయింది…
ఇంట్లోకి వెళ్లి అద్దం ముందు నిలబడి అద్దానికి అతికించి ఉన్న ఒకప్పటి తన ఫోటో ని చూసి తనను తాను చూస్తూ ఇలా ఆలోచించసాగింది…
“ఒకప్పుడు రాణి లాగ బతికిన నేను,..ఇప్పుడు ఒక మధ్యతరగతి స్త్రీ ని .
ఒకప్పుడు రంగు రంగుల బట్టలలో .అందం గా దేవకన్యలా తిరిగిన నేను ..ఇప్పుడు అలా ఉండలేను.. .
ఒకప్పుడు శంకర్ నన్ను ప్రేమించడం లో ఆశ్చర్యం లేదు …కాని ఇప్పటికి ఎందుకు ప్రేమిస్తున్నాడు…?
నేను తాత్కాలిక మైన అందానికి ఆకర్షింపబడి శాశ్వతమైన అందాన్ని దూరం చేసుకున్నా” అని బాధపడ సాగింది.
..
సంజన పశ్చాత్తాపం 100% సత్యం…ఎందుకటే ఇక్కడ తాత్కాలికమైన అందం అంటే రూపం . అందమైన రూపం శాశ్వతం కాదు…ఆ రూపం తాత్కాలికం ,వయసు మీరే కొద్ది ఆ అందం నశించోచ్చు. అందమైన రూపం నశిస్తే ఆకర్షణ పోతుంది దాంతో ప్రేమ తగ్గుతుంది…క్రమంగా జీవితం లో విభేదాలు మొదలవుతాయి.
శాశ్వతమైన అందం అంటే ” మనసు” . మనసుని చూసి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికి నశించదు…ఎందుకంటే …వయసు మీరేకోద్ది శరీరానికి వృద్ధాప్యం ఉంటుంది కాని మనసుకి ఎప్పటికి వృద్ధాప్యం ఉండదు కదా.
so friends నేను చెప్పేది ఏంటంటే శరీరాన్ని చూసి ప్రేమించకుండా …మనసు ని చూసి ప్రేమించండి ప్రేమ లోని మాధుర్యాని 100% ఆశ్వాదించండి…..                                                                             … Sanju           

8 thoughts on “Andham….Aakarshana…Prema …Jeevitham …(Dear friends please spend 2 min to read).. Sanju”

  1. chala bagundiii sanjana garu me article ede manasu ki sheriraniki unna theda
    manasu yeppatiki alane undi pothundii kani sheriram maruthune untundii roju roju

  2. Superrrrrrrrrrrrr ga rasavu sanju…..Premaki inthakante chakkaga definition bahusa inkevvaru ivvaleru….hatsoff to u 🙂 ……neeku manchi manasunna abbayi thappakunda vasthadu …pelliki matram thappakunda pilavali nannu.. sarena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *